“సర్కారు వారి పాట”లో మహేష్ కి బాగా హార్డ్ గా అనిపించిన సీక్వెన్స్.!

Published on May 11, 2022 9:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబ్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ మరియు స్టైలిష్ ఎంటర్టైనర్ భారీ అంచనాలు నడుమ విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి గాను మహేష్ మళ్ళీ తన కెరీర్ లోనే ఒక సరికొత్త మేకోవర్ లోకి మారి తన లుక్స్ తో అదిరే ట్రీట్ ని అందివ్వగా.

దానితో పాటుగా ఈ సినిమాలో తన డ్రెస్సింగ్ మరియు దానికి సరైన యాక్షన్ ని జోడించి దర్శకుడు పరశురామ్ పెట్ల అదిరే ట్రీట్ ని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాలో ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా సాలిడ్ గా ఉన్నట్టు అర్ధం అయ్యింది. మరి ఈ సినిమాలో మహేష్ కి ఓ యాక్షన్ సీక్వెన్స్ కాస్త కష్టంగా అనిపించిందట.

అదే బీచ్ లో ప్లాన్ చేసిన సీక్వెన్స్ ని తెలిపారు. ఆ ఒక్క సీక్వెన్స్ దాదాపు పది రోజులు షూటింగ్ చేసారని మండుటెండలో ఫైట్ సీన్ అంటే కాస్త కష్టంగానే అనిపిస్తుంది అని ఈ సినిమాలో ఇది కాస్త హార్డ్ గా అనిపించింది అని కానీ సినిమాని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ చేసానని మహేష్ తెలిపారు.

సంబంధిత సమాచారం :