ఫ్యాన్సీ రేటుకు మహేష్ సినిమా ఆడియో రైట్స్ !
Published on Dec 1, 2017 1:00 pm IST

మహేష్ బాబు కొరటాల శివలు కలిసి ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా తాలూకు కొత్త షెడ్యూల్ నిన్న హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది. ఏప్రిల్ 27 న సినిమా విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబు సిఎంగా కనిపించబోతున్నారని టాక్.

 
Like us on Facebook