“సర్కారు వారి పాట”పై మహేష్ మాస్ రిప్లైస్.!

Published on Sep 25, 2021 7:59 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే మరో స్పెషల్ ప్రాజెక్ట్ గా అందరూ భావిస్తున్నారు. ఎందుకు అంటే ప్రీ లుక్ పోస్టర్ నుంచే మహేష్ మళ్ళీ వింటేజ్ బాబు ని గుర్తు చెయ్యడంతో అంతా ఓ పదేళ్లు వెనక్కి వెళ్లిపోయారు. ముఖ్యంగా అయితే పోకిరి రోజులు అంతా ఆశించారు.

మరి ఆ సినిమా తరహాలోనే ఈ సినిమాతో గుర్తు చేస్తారని మహేష్ హామీ ఇస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఓ ప్రెస్ మీట్ లో సర్కారు వారి పాట పై సాలిడ్ రిప్లైస్ మహేష్ అందించారు. ఈ సినిమా డెఫినెట్ గా పోకిరి వైబ్స్ ని తీసుకొస్తుంది అని అంతే కాకుండా ఎన్నో సిట్టింగ్స్ కాదు ఒక్క సిట్టింగ్ లోనే తాను ఈ కథ ఓకే చేసానని చెప్పుకొచ్చారు. మరి దీనితో సర్కారు వారి పాట విషయంలో మహేష్ ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :