మరో నెల పాటు అహ్మదాబాద్ లోనే మహేష్ !
Published on Nov 24, 2016 9:54 am IST

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇప్పటికే చెన్నై, హైదరాబాద్ లలో షెడ్యూళ్ళు పూర్తి చేసుకుని ఈరోజు అహ్మదాబాద్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ ఈరోజే లేదా రేపు మొదలుకానుండగా మహేష్ బాబు మాత్రం 27 వ తేదీ నుండి షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. సుమారు నెల రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ నెల రోజుల్లో కొన్ని రోజులు పూణేలో కూడా షూటింగ్ జరుగుతుందట.

మొదటి రెండు షెడ్యూళ్ళు పూర్తైన తరువాత లొకేషన్స్ కోసం మురుగదాస్ టీమ్ చాలా కష్టపడి గుజరాత్ లోని ఈ అహ్మదాబాద్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‍తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్సరసన రకుల్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్నఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జూన్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook