హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్న మహేష్ బాబు !

1st, October 2016 - 09:21:54 AM

mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం ఈ మధ్యే చెన్నైలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీని తరువాత కాస్త బ్రేక్ తీసుకున్న టీమ్ అహ్మదాబాద్ లో షూటింగ్ లొకేషన్లు వెతికే పని ముగించి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించే పనిలో పడింది. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో ఈరోజు నుండి మొదలుకానుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలో కీలకమైన ఛేజింగ్ సన్నివేశాలను భాగ్యనగరపు బిజీ రోడ్ల మీద చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఛేజింగ్ సీన్లలో హీరో మహేష్ బాబు కూడా పాల్గొననున్నాడు. అంటే మహేష్ ఈరోజు హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్నాడన్న మాట. వారంపాటు జరిగే ఈ షెడ్యూల్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 3వ వారంలో అహ్మదాబాద్, గుజరాత్ లలో మరో షెడ్యూల్ జరుగుతుంది. ఇకపోతే ఈ చిత్రంలో మహేష్ ఐబి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.