అహ్మదాబాద్‌లో మహేష్ సందడి మొదలైంది..!
Published on Nov 28, 2016 10:49 am IST

mah-23-lat

సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే హైద్రాబాద్‌, చెన్నైలలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని తాజాగా అహ్మదాబాద్‍లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో మహేష్, రకుల్ ప్రీత్ పాల్గొంటూ ఉండగా ఓ భారీ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ జరుగుతోందని తెలియడంతో షూట్ ప్రాంతమైన ప్రహ్లాద్‌నగర్ వాసులంతా అక్కడికి వచ్చి మహేష్‌ను కలిసేందుకు ఉత్సాహం చూపారట.

హైద్రాబాద్‌తో పోల్చితే, అహ్మదాబాద్‌ లాంటి తెలుగు సినిమా పెద్దగా పరిచయం లేని ప్రాంతంలో షూట్ చేస్తే క్రౌడ్ ఇబ్బంది ఉండదని ఈ ప్రాంతంలో షూట్ ప్లాన్ చేసినట్లు నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు అక్కడి మీడియాకు తెలిపారు. డిసెంబర్ 23వరకూ గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎన్.వి. ప్రసాద్‌తో కలిసి ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సీజన్ తర్వాత విడుదల కానుంది.

 
Like us on Facebook