మహేష్-వంశీ మూవీ ఆగిపోలేదట?

Published on Feb 27, 2020 3:27 pm IST

మహేష్ వంశీ పైడిపల్లి మూవీపై గత కొద్దిరోజులుగా విపరీతమైన చర్చ నడుస్తుంది. మే లో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ మహేష్ ఫైనల్ స్క్రిప్ట్ పట్ల సంతృప్తిగా లేని కారణంగా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం మహేష్, వంశీ సిద్ధం చేసిన స్క్రిప్ట్ కి కొన్ని మార్పులు చేర్పులు చెప్పారట. వంశీ ప్రస్తుతం మహేష్ సూచించిన ప్రకారం స్క్రిప్ట్ కు హంగులు అద్దే పనిలో ఉన్నారట. కొంచెం ఆలస్యం అయినా వంశీ పైడిపల్లి మహేష్ మూవీ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం అని సమాచారం.

ఈ లోపు మహేష్ దర్శకుడు కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటారట. కొంచెం లేటైనా వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్ నటించడం జరుగుతుందని వినికిడి. ప్రస్తుతం మహేష్ కొన్ని వ్యాపార ప్రకటనల ప్రచార చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :