సోదరి ప్రయత్నానికి శుభాకాంక్షలు చెప్పిన మహేష్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల మొదటిసారి మెగా ఫోన్ పడుతూ ఒక సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా ఈరోజే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తునం ఈ చిత్రంలో త్రిధా చౌదరి, అమైరా దస్తూర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆనంది ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్, సంజయ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈరోజు ఉదయం మంజుల సోదరుడు మహేష్ బాబు తన సోదరి మొదటిసారి దర్శకత్వం చేస్తున్న సందర్బంగా ఆమెకు ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంలో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల ఎవరు, ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.