మహేష్ బాబు పాటే నాగశౌర్య సినిమాకు టైటిల్ !

ఇటీవలే ‘ఛలో’ సినిమాతో కెరీర్లోనే పెద్ద కమర్షియల్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగ శౌర్య రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు కథలు విన్న ఆయన కొన్నిటిని లాక్ చేసినట్టు తెలుస్తోంది. వాటిలో దర్శకుడు, నటుడు కాశీ విశ్వనాథ చెప్పిన కథ కూడా ఉందని సమాచారం.

నటుడిగా బిజీగా ఉన్న కాశీ విశ్వనాథ్ ఒకప్పుడు దర్శకుడు. 2003లో ‘నువ్వు లేక నేను లేను, తొలి చూపులోనే’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన నటుడిగా బిజీగా మారి దాదాపు 15 ఏళ్ల తర్వాత నాగ శౌర్య సినిమాతో మెగా ఫోన్ పట్టుకోనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ సినిమా ‘దూకుడు’లోని ‘గురువారం మార్చి ఒకటి’ అనే సూపర్ హిట్ పాటనే టైటిల్ గా పెట్టారని సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇకపోతే నాగ శౌర్య ఫిబ్రవరి నెలాఖరు నుండి సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా, దాని తర్వాత మరొక కొత్త దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో ‘నర్తనశాల’ అనే మరొక సినిమా చేయనున్నాడు.