యూఎస్ లో భారీ స్థాయిలో విడుదలవుతున్న మజిలీ !

Published on Mar 20, 2019 10:17 am IST

యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న ఎమోషనల్ రొమాంటిక్ ఎంటెర్టైనెర్ ‘ మజిలీ’ యూఎస్ లో సుమారు 150 లొకేషన్లలో రిలీజ్ కానుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ అలాగే సాంగ్స్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నాగ చైతన్య క్రికెటర్ గా నటిస్తుండగా నటి దివ్యంకా కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాల నేపథ్యంలో ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న చైతూ ఈ చిత్రం ఫై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :