ఇక వరుసగా ‘మేజర్’ అప్డేట్స్

Published on Feb 27, 2020 7:37 pm IST

యంగ్ హీరో అడివి శేష్ ‘గూఢచారి, ఎవరు’ లాంటి హిట్ సినిమాల తర్వాత ఆ తరహాలోనే ‘మేజర్’ అనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉండనుంది. ఇది 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ.

ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి స్వయంగా నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంభందించి ఈమధ్య పెద్దగా అప్డేట్స్ రాలేదు. కానీ మార్చి నెలలో వరుసగా సినిమా విశేషాలను విడుదలచేయన్నారు టీమ్. ఈ విశేషాల్లో సినిమా టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ లాంటి అప్డెట్స్ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ చిత్రం ఈ యేడాదిలోనే విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More