లేటెస్ట్ : అజిత్ ‘తునీవు’ సెకండ్ సాంగ్ అప్ డేట్

లేటెస్ట్ : అజిత్ ‘తునీవు’ సెకండ్ సాంగ్ అప్ డేట్

Published on Dec 18, 2022 2:11 AM IST

తలా అజిత్ కుమార్ హీరోగా బోనీకపూర్ తో కలిసి జీ స్టూడియోస్ వారు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ తునీవు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్లింగ్ యక్షన్ ఎంటర్టైనర్ మూవీలో మంజు వారియర్ ప్రధాన పాత్ర చేస్తుండగా యువ సంగీత దర్శకడు జీబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన తునీవు నుండి ఇటీవల రిలీజ్ అయిన చిల్లా చిల్లా అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని అజిత్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంది.

కాగా తూనీవు మూవీ నుండి సెకండ్ సాంగ్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితం మేకర్స్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అప్ డేట్ అందించారు. కాసేతాన్ కడవులదా అనే పల్లవితో సాగే సెకండ్ లిరికల్ సాంగ్ ని రేపు అనగా ఆదివారం మధ్యాహ్నం 2 గం. లకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు. కాగా తునీవు మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అలానే ఈ మూవీని తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే దాని పై అతి త్వరలో అధికారికంగా మేకర్స్ నుండి ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు