“టక్ జగదీష్” చిత్రం విడుదల పై మేకర్స్ ఏమన్నారంటే?

Published on Aug 22, 2021 3:00 pm IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం లో ఐశ్వర్య రాజేష్, తిరువీర్, వైష్ణవి చైతన్య, డానియల్ బాలాజీ, దేవ దర్శిని, జగపతి బాబు, నరేష్, పార్వతి మాల, రోహిణీ, రావు రమేష్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీశ్ పెడ్డి లు షైన్ స్క్రీన్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. తాజాగా షైన్ స్క్రీన్స్ టక్ జగదీష్ చిత్రం విడుదల కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేయడం జరిగింది.

మంచి సినిమాలని అందించడం, తెలుగు ప్రేక్షకులని అలరించడానికి షైన్ స్క్రీన్స్ స్థాపించబడింది అని తెలిపారు. మజిలీ చిత్రం తర్వాత నాని తో టక్ జగదీష్ చిత్రాన్ని ప్రారంభించాం అని అన్నారు. రెండున్నర సంవత్సరాలు గా ఈ సినిమాను పెంచి పోషించాం అని అన్నారు. గతేడాది డిసెంబర్ లో ఈ చిత్రం పూర్తీ అయింది అని, సమ్మర్ కి విడుదల చేయాలని అనుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ పరిస్థితులను మరింత కష్టతరం చేసింది అని అన్నారు. వివిధ సమస్యలు నియంత్రణ లో లేనందున అనిశ్చితి కొనసాగుతుంది అని అన్నారు.

ఈ డిజిటల్ యుగంలో ఇంతకాలం కంటెంట్ ను కాపాడుకోవడం అంత సులభం కాదు అని అన్నారు. పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయి అనే విషయం లో చాలా సందిగ్ధత తో హీరో నాని ను సంప్రదించాం అని, వేరే ఆప్షన్ లేనందుకు నాన్ థియేట్రికల్ విడుదల కి ఒప్పించాం అని అన్నారు. నాని థియేట్రికల్ గురించి ఆలోచించినందున నిరాశ చెందారు అని అన్నారు. పరిస్థితి ను అర్దం చేసుకొని నిర్మాతల సమస్యలను పరిగణన లోకి తీసుకొని ఓకే చెప్పారు అని అన్నారు. నాని నిర్ణయం కి థాంక్స్ చెబుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. దర్శకులు కూడా సమస్యలను అర్దం చేసుకొని ఒప్పుకున్నారు అని తెలిపారు. థియేటర్ల లో విడుదల కోరుకొనే వాళ్ళం అని, కానీ టక్ జగదీష్ ను అందరికీ చేర్చాలని ఉద్దేశ్యం తో ఇలా చేస్తున్నట్లు తెలిపారు. అందరూ దీనికి సహకరించగలరు అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :