ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మలైకా అరోరా !

Published on Apr 3, 2022 11:01 pm IST

బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం తెలిసిందే. ముంబై నుంచి పూణె వెళ్తుండగా పన్వేల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన మలైకాను హుటాహుటిన ముంబై లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, తాజాగా మలైకా అరోరా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఆమె నుదుటికి గాయాలయ్యాయి.

గాయాలకు చికిత్స చేసిన వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జి చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం.. మలైకా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల.. అదే సమయంలో రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మీటింగ్ కోసం వెళ్తున్న వాహనాలను.. కారు ఢీ కొట్టింది అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :