మంచు మనోజ్ “ఉస్తాద్” గేమ్ షో కి డేట్ లాక్.!

మంచు మనోజ్ “ఉస్తాద్” గేమ్ షో కి డేట్ లాక్.!

Published on Dec 6, 2023 4:00 PM IST

టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమాలు స్టార్ట్ చేసి పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాలు మాత్రమే కాకుండా తాను రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ షో తో అయితే ఓటిటి లో ఎంటర్ అవుతున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేసాడు. మన తెలుగులో ఇప్పుడు మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్న ఈటీవీ విన్ యాప్ లో అయితే మనోజ్ చేస్తున్న ఆ థ్రిల్లింగ్ గేమ్ షో నే “ఉస్తాద్”.

ఈ షో ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి ఆసక్తి రేపిన తాను ఎప్పటి నుంచి ఓటిటి వీక్షకులని పలకరిస్తాడు అనేది కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ గేమ్ షో ని మేకర్స్ ఈ డిసెంబర్ 15 నుంచి అయితే స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ షో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ షో ని అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు