‘మా’ కుటుంబం కోసం మంచు విష్ణు ఎగ్జైటింగ్ న్యూస్!

Published on Aug 21, 2021 2:00 pm IST

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మా ఎన్నికలు(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కోసం హాట్ టాపిక్ గా చర్చలు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ ఎన్నికలలో పలువురు సినీ ప్రముఖులతో పాటుగా హీరో మంచు విష్ణు కూడా పోటీలో నిలబడ్డాడు. మరి ఈ ఎన్నికలను ప్రిస్టేజియస్ గా అలాగే బాధ్యతాయుతంగా తీసుకున్న విష్ణు ఇది వరకే తాను ఏమేం చెయ్యాలనుకుంటున్నానో తెలిపాడు.

మరి అలాగే ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ న్యూస్ అంటూ ఒక వీడియోని సోషల్ మీడియా ద్వారా తన మా కుటుంబానితో పంచుకున్నాడు. తమ మా కుటుంబం కోసం మూడు స్థలాలు చూశానని తమ కల కోసం ఈ స్థలాల్లో ఒకటి మనం కూర్చుని ఫిక్స్ చేద్దామని అందుకే తాను ఈ వీడియో చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అయితే విష్ణు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ డబుల్ డోస్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :