“దెయ్యం తో సహజీవనం” నుండి మందార కన్నె మందార పాట విడుదల!

Published on Jul 25, 2021 8:00 am IST


మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఇన అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు, వారు గతంలో చేసిన ఎన్నో మోసాల గురించి తెలుసుకొని వారి పై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అనే కథాంశం తో దెయ్యం తో సహజీవనం చిత్రం తెరకెక్కింది. అయితే అనురాగ్ కంచర్ల సమర్పణ లో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నట్టి కుమార్ దర్శకత్వం లో నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో ఈ చిత్రం వస్తోంది. నట్టి కుమార్ దర్శకత్వం లో నట్టి క్రాంతి నిర్మిస్తున్న చిత్రం ఇది. అయితే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్ట్ మొదటి వారం లో అయిదు బాషల్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

అయితే తాజాగా ఈ చిత్రం నుండి యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడిన మందార కన్నె మందార అనే పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ చిత్ర దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, కాశ్మీర్ లోని అద్భుతమైన అందాలతో 5 రోజుల్లో షూట్ చేసిన మందార కన్నె మందార పాటను యాసిన్ నిజర్, రమ్య బెహ్ర పాడారు అని అన్నారు. అయితే సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది అని, త్వరలో టీజర్ విడుదల చేసి ఐదు బాషల్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అయితే బాగా చదువు కొని గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు, వారి మోసాల గురించి తెలుసుకొని అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అనే కథాంశం తో ఈ చిత్రం నడుస్తుంది అని అన్నారు.

సంబంధిత సమాచారం :