వాలెంటైన్స్ డే ట్రీట్ రెడీ చేసిన మణిరత్నం!
Published on Feb 6, 2017 10:28 am IST


‘ఓకే బంగారం’ సినిమాతో తన మ్యాజిక్ ఏంటో మరోసారి నిరూపించుకొని, సూపర్ హిట్ కొట్టిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం తాజాగా మళ్ళీ ఓ రొమాన్స్ డ్రామాతోనే మెప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ‘కాట్రు వెళదియై’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కార్తీ, అదితి రావు హైదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘చెలియా’ పేరుతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డబ్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్ నెలలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పట్నుంచే సందడి మొదలుపెట్టేసింది.

ఫిబ్రవరి 2న చెలియా ఆడియోలోని ‘హంసరో’ అన్న మొదటిపాట విడుదల కాగా, ఆ పాట సూపర్ హిట్ అయింది. ఇక ఇదే కోవలో ఇప్పుడు ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) కానుకగా ‘మైమరపురా’ అన్న మరో పాటను విడుదల చేస్తున్నారు. మణిరత్నం-రహమాన్‌ల కాంబినేషన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటల రిలీజ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మద్రాస్ టాకీస్ పతాకంపై మణిరత్నం స్వయంగా నిర్మిస్తూ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కార్తీ ఓ యుద్ధ విమాన పైలైట్‌గా కనిపించనున్నారు.

 
Like us on Facebook