మణికందన్, శ్రీ గౌరీ ప్రియ ల ‘లవర్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

మణికందన్, శ్రీ గౌరీ ప్రియ ల ‘లవర్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Mar 13, 2024 3:01 AM IST

గుడ్ నైట్ మూవీ ఫేమ్ మణికందన్, మ్యాడ్ మూవీ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ మూవీ లవర్. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా ఎంటర్టైనర్ మూవీని తెలుగులో ట్రూ లవర్ టైటిల్ తో ఎస్కెఎన్, మారుతీ కలిసి రిలీజ్ చేసారు. ప్రభురాం వ్యాస్ తెరకెక్కించిన ఈ మూవీ తమిళ్ తో మంచి సక్సెస్ అందుకోగా తెలుగులో కూడా పర్వాలేదనిపించింది.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ ద్వారా మార్చి 27న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, హిందీ భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. కన్న రవి, శరవణన్, గీతా కైలాసం, హరీష్ కుమార్, నిఖిలా శంకర్ మరియు రిని తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించిన ఈ మూవీని నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పసిలియన్, యువరాజ్ గణేశన్ సంయుక్తంగా నిర్మించగా సీన్ రోల్డాన్ స్వరాలు సమకూర్చారు. మరి లవర్ మూవీ ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు