మరో మైలురాయిని దాటేసిన మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్”

Published on Oct 7, 2022 8:08 pm IST


పీరియాడికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 థియేటర్లలో విడుదలై, చాలా ఏరియాల్లో బాగా రన్ అవుతుంది. స్టార్ ఫిల్మ్ మేకర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో మైలురాయిని దాటింది. మేకర్స్ ప్రకారం, బిగ్గీ మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఈ సినిమా ఇదే జోరును కొనసాగిస్తే రానున్న రోజుల్లో మరింత భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో హిట్ కాకపోయినా తమిళనాడు, ఓవర్సీస్‌లో టిక్కెట్ల వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష మరియు జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ను మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ల పై నిర్మించడం జరిగింది. ఈ మెగా మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :