మన్మధుడు2 సెకండ్ టీజర్-రకుల్ ఇకపై ‘ఏ’ సర్టిఫికేట్ చూపిస్తుందట….!

మన్మధుడు2 సెకండ్ టీజర్-రకుల్ ఇకపై ‘ఏ’ సర్టిఫికేట్ చూపిస్తుందట….!

Published on Jul 9, 2019 9:42 AM IST


కింగ్ నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ ” మన్మథుడు 2″. దర్శకుడు రాహుల్ రవీంద్ర కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన మొదటి టీజర్ లో డైరెక్టర్, నాగార్జున పాత్ర స్వభావాన్ని పరిచయం చేశాడు. పైకి ఆడవాసనే ఎరుగని ముదురు బ్రహ్మచారిగా కపిస్తూ చీకట్లో ఎవరికీ తెలియకుండా అమ్మాయిలతో రొమాన్స్ చేసే కన్నింగ్ మన్మథుడిగా నాగార్జున ఆ టీజర్ లో ఇరగదీశాడు. ఐతే ఆ మొదటి టీజర్, రకుల్ ఎక్కడా కనిపించకుండా రూపొందించడం జరిగింది.

ఐతే నేడు ముందుగా ప్రకటించిన విధంగా రకుల్ రోల్ ని పరిచయం చేస్తూ రెండవ టీజర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. టీజర్ సీనియర్ నటి లక్ష్మీ, రకుల్ అవంతిక అనే పేరు కలిగిన సంప్రదాయమైన, పద్దతి గల పిల్లగా పరిచయం చేస్తుంది. కానీ అవంతిక మాత్రం కనిపించని ముదురులా టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. దమ్ము కొడుతూ, నాగార్జునని టీస్ చేస్తూ పక్కా అల్లరిపిల్ల వేషాలు వేస్తుంది. టీజర్ చివర్లో “ఇప్పటి వరకూ ‘యూ’ సర్టిఫికెట్ ట్రై చేశా, ఇకపై ‘ఏ’ సర్టిఫికేట్ చూపిస్తా” అనే డైలాగ్ చూస్తుంటే రకుల్ పాత్ర “మన్మధుడు2” లో కొంచెం హాట్ గానే ఉంటుంది అనిపిస్తుంది.

కీర్తి సురేష్ అతిధి పాత్రలో నటిస్తుండగా, వెన్నెలకిషోర్,రావు రమేష్,ఝాన్సీ ప్రధాన పాత్రలలో కనిపిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్,వికామ్ 18,మనం ఎంటర్ప్రైజెస్,ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 9న విడుదల కానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు