సమీక్ష : “మార్టిన్ లూథర్ కింగ్” – స్లోగా సాగే కామెడీ పొలిటికల్ డ్రామా

సమీక్ష : “మార్టిన్ లూథర్ కింగ్” – స్లోగా సాగే కామెడీ పొలిటికల్ డ్రామా

Published on Oct 28, 2023 3:04 AM IST
Martin Luther King Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 27, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, చక్రధర్, రాఘవన్ తదితరులు

దర్శకుడు : పూజ అపర్ణ కొల్లూరు

నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, వెంకటేష్ మహా

సంగీతం: స్మరణ్ సాయి

సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగేరా

ఎడిటర్: పూజ అపర్ణ కొల్లూరు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

దసరా చిత్రాలు అనంతరం టాలీవుడ్ దగ్గర ఈ వారం రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా తమిళ చిత్రం “మండేలా” కి రీమేక్ గా దర్శకురాలు పూజా అపర్ణ కొల్లు తెరకెక్కించిన చిత్రం “మార్టిన్ లూథర్ కింగ్” సినిమా కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..పడమరపాడు అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు జగజ్జీవన్ రామ్(నరేష్) అలాగే లోక్ మాన్య తిలక్(వెంకటేష్ మహా) ఇద్దరు కూడా ఆ ఊరికి ప్రెసిడెంట్ అవుదామని ఎన్నికల్లో పోటీ చేస్తారు. అయితే ఈ ఎన్నికలు కాస్త రెండు వర్గాలుగా విడిపోతుంది. ఫైనల్ గా ఎలక్షన్ అయ్యాక రిజల్ట్ ఇద్దరికీ సమానంగా వస్తుంది. కానీ ఒక సాధారణ చెప్పులు కొట్టుకునే వ్యక్తి స్మైల్(సంపూర్ణేష్ బాబు) ఓట్ ఒక్కటి మాత్రం ఇద్దరి మధ్యలో డిసైడింగ్ ఓట్ గా నిలుస్తుంది. మరి ఈ ఒక్క ఓట్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అసలు కథ ఎలా మలుపు తిరిగింది. ఇంతకీ స్మైల్ ఎవరికి మద్దతు తెలిపాడు అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమా కథాంశానికి ప్రధాన బలాల్లో కథానాయకుని పాత్ర కూడా ఒకటి. దీనిని ఒరిజినల్ లో యోగిబాబు రక్తి కట్టించగా తెలుగు వెర్షన్ లో సంపూర్ణేష్ బాబు ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ గా నిలిచాడు. అయితే ఈ ఛాయిస్ లో తాను కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడమే కాకుండా దీనిని చాలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో కంప్లీట్ చేసాడని చెప్పొచ్చు.

అలాగే నటి శరణ్య ప్రదీప్ ఓ డీసెంట్ రోల్ లో కనిపించి మెప్పిస్తుంది. అలాగే నటులు నరేష్ మరియు వెంకటేష్ మహా లు కూడా మంచి పెర్ఫామెన్స్ ని తమ పాత్రల్లో అందించారు. అలాగే సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా ఆసక్తిగా సాగింది.

వీటితో పాటుగా పలు సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ఇంపాక్ట్ కలిగించేలా అనిపిస్తుంది. ఫైనల్ గా కులాలు సంబంధించి ఇప్పటికీ మన దేశంలో ఉన్న వివక్షత లాంటి కొన్ని సున్నితమైన అంశాలను సినిమాలో ఆకట్టుకునే విధంగా చూపించడం మెప్పిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో ఆల్రెడీ మంచి కథాంశం ఉంది కానీ దానిని ప్రెజెంట్ చేసిన విధానంలో మాత్రం చాలా అవకతవకలు ఉన్నాయి. అలాగే ఫస్టాఫ్ లో కాస్త ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసి ఉండాల్సింది. కానీ ఇలాంటివి లేకపోవడంతో మంచి కథాంశం ఒక డల్ ప్లే తో పేలవంగా అనిపిస్తుంది.

అలాగే సినిమాలో కొన్ని పత్రాలు బాగానే ఉన్నప్పటికీ వాటిని ఇంకాస్త మెరుగ్గా కాస్త స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండు. అలానే ఈ తరహా కొన్ని పొలిటికల్ సెటైర్ డ్రామాస్ లో ఎంత కామెడీతో సీన్స్ ట్రై చేస్తే చూసేందుకు సినిమా అంత ఎంగేజింగ్ గా ఉంటుంది.

కానీ ఈ చిత్రంలో అలాంటివి అంత ఎక్కువగా అయితే ఏమి కనిపించవు ఏవో కొన్ని సీన్స్ మినహా సినిమాలో పెద్దగా ఏమి లేదు. ఇక వీటితో పాటుగా మరికొన్ని బలమైన సన్నివేశాలు మంచి డైలాగ్స్ కూడా పెట్టి ఉంటే ఈ చిత్రానికి మరింత ఇంపాక్ట్ కలిగించేవి. వీటితో పాటుగా సినిమాలో కొంతవరకు సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. వీటితో కొంచెం విసుగు రావచ్చు.

 

సాంకేతిక వర్గం :

 

నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా నిర్మాతలు సినిమాని నాచురల్ గా తెరకెక్కించారు. ఇక సాంకేతిక వర్గంలో సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఎడిటింగ్ లో కొన్ని అనవసర సీన్స్ తగ్గించాల్సింది.

ఇక దర్శకురాలు పూజా విషయానికి వస్తే.. ఆమె ఈ రీమేక్ ని తెలుగు నేటివిటీలో హ్యాండిల్ చేయడంలో పర్వాలేదు అనిపిస్తారు. కానీ ఇంకాస్త జాగ్రత్తలు నరేషన్ విషయంలో తీసుకొని ఉంటే బాగుండేది. వెంకటేష్ మహాతో మరింత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ని రాబట్టి ఉంటే ఖచ్చితంగా సినిమా అవుట్ పుట్ మరింత చక్కగా వచ్చి ఉండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మార్టిన్ లూథర్ కింగ్” లో కాన్సెప్ట్ బాగుంది అలాగే నటుడు సంపూర్ణేష్ బాబు తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు అలాగే కొన్ని సీన్స్ వరకు ఈ చిత్రం పర్వాలేదు అనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయి చిత్రంగా మాత్రం అంత ఆకట్టుకోదు. డల్ నరేషన్ స్క్రీన్ ప్లే లు సినిమాని బలహీనపరిచాయి. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు