కొత్త కాన్సెప్ట్ తో దిగుతున్న మారుతి !

చేసే ప్రతి సినిమాలోనూ కొంత వైవిధ్యం చూపాడానికి ట్రై చేసే దర్శకుల్లో మారుతి కూడ ఒకరు. ఇదే ఫార్ములాతో ప్రేక్షకుల పల్స్ పట్టుకుని పలు విజయాలనందుకున్న ఆయన తన టీమ్ తో కలిసి మరో విభిన్నమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

ఈ విభిన్నమైన ప్రయత్నం ఏమిటి, దాంతో ఎలాంటి సినిమా చేస్తున్నారు, దానికి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనే విషయాల్ని రేపు రివీల్ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసిన ఈ ప్రకటన పోస్టర్ ను చూస్తుంటే ఈ కొత్త కాన్సెప్ట్ డబ్బు నైపథ్యంలో ఉంటుందనిస్తోంది.