మసూద శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ టీవి ఛానల్!

మసూద శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ టీవి ఛానల్!

Published on Jan 2, 2023 6:59 AM IST

కొత్త డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరునీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మసూద. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం థియేటర్ల లో మాత్రమే కాకుండా, డిజిటల్ ప్రీమియర్ గా రిలీజై ప్రేక్షకులని అలరిస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టివి ఛానల్ సొంతం చేసుకుంది.

ప్రముఖ టివి ఛానల్ జెమిని టివి ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. త్వరలో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టీవీ లో ప్రసారం కానుంది. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు