“శ్రీదేవి సోడా సెంటర్” ట్రైలర్ 24 గంటల్లో మాస్ రికార్డు!

Published on Aug 20, 2021 2:30 pm IST

సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా కరుణా కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. ఈ నెల ఆగస్ట్ 27 వ తేదీన సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన పాటలు, గ్లింప్స్ సినిమా పై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల అయిన చిత్రం ట్రైలర్ మాస్ రికార్డ్ ను కొల్లగొట్టింది.

విడుదల అయిన 24 గంటల్లో 3.08 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా,157.6k లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇంకా ఈ సునామీ కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తుండటం తో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. విజయ్ చిల్లా మరియు శశి దేవి రెడ్డి లు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :