‘వెంకీ’ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ?

‘వెంకీ’ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ?

Published on Oct 5, 2026 10:01 AM IST

విక్టరీ వెంకటేష్ సినిమా కెరీర్ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ అక్టోబర్ 9న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తాజా ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ సినిమా పై బజ్ బలంగా ఉంది. పైగా ‘దసరా’ సీజన్. కాబట్టి, అంచనాలు కూడా ఉన్నాయి. అటు ప్రమోషన్స్ కూడా బలంగా చేస్తున్నారు. వెంకటేష్ గత రెండు సినిమాలు ‘సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు’ కూడా అద్భుత విజయాలు సాధించాయి.

మొత్తానికి వెంకటేష్ కెరీర్ ప్రస్తుతం హిట్ మీద ఉంది. కాబట్టి, ‘ఆదర్శ కుటుంబం’కి బాగా కలిసి రానుంది. ప్రేక్షకుల్లో ఈ ఆసక్తిని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే షేర్ వెంకీ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబోతున్నాయని అంచనా ఉంది. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తొలి వీకెండ్‌లో ఆ నంబర్లు మరింత భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కాగా ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్ మరియు బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు