‘జార్జ్ క్రిష్’ క్లైమాక్స్ కి సన్నాహాలు !

‘జార్జ్ క్రిష్’ క్లైమాక్స్ కి సన్నాహాలు !

Published on Oct 5, 2026 9:00 AM IST

George Krish

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ నెల రెండో వారంలో ఓ ప్రత్యేక సెట్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను ఘాట్ చేస్తారట. ఈ క్లైమాక్స్ కోసం కొన్ని స్పెషల్ స్టంట్స్ ప్లాన్ చేసారు. శర్వానంద్ ఫై ఈ స్టంట్స్ ను షూట్ చేస్తారట. ఈ సీక్వెన్స్ షూట్ అనంతరం శర్వానంద్ పై ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారట. ఈ సాంగ్ కోసం కూడా ప్రత్యేకంగా సెట్స్ కూడా వేస్తున్నారట.

ఇక, శర్వానంద్ ఈ సినిమాలో జూనియర్ సైంటిస్ట్ గా కనిపించబోతున్నాడు. తన పాత్ర చుట్టూ సాగే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. సినిమాలో చాలా ఎపిసోడ్స్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మానస వారణాసి నటిస్తుంది. శర్వానంద్ – హీరోయిన్ మానస వారణాసి లవ్ స్టోరీ చాలా ట్రెండీగా ఉంటుందని.. చాలా ఫన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అనీల్ సుంకర నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు