‘జనవరి 12 విడుదల’ కోసం మరో సర్ ప్రైజింగ్ ?

‘జనవరి 12 విడుదల’ కోసం మరో సర్ ప్రైజింగ్ ?

Published on Oct 5, 2026 11:01 AM IST

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమా పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందని.. అది ఓ గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. మరి ఆ సర్ ప్రైజింగ్ రోల్ లో ఏ హీరో కనిపించబోతున్నాడు ?, ఎలాంటి రోల్ లో కనిపించబోతున్నాడు ? అనేది ఆసక్తికరం. మొత్తానికి ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూడు ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. కాగా ఇక ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో వెంకీ కనిపిస్తారట.. ఈ లుక్ కి పూర్తి భిన్నంగా కళ్యాణ్ రామ్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. పైగా స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇక నవంబర్ లోపు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.

తాజా వార్తలు