ఇంట‌ర్వ్యూ : డైరెక్టర్ రితేష్ రాణా – ‘మత్తు వదలరా’కి మంచి ఆదరణ లభిస్తోంది.

Published on Dec 26, 2019 5:13 pm IST

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. కాగా రితేష్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు . కాగా ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఈ సినిమా సువర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రితేష్ విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

 

సినిమాకి ఎలాంటి టాక్ వచ్చింది ? మీరెలా ఫీల్ అవుతున్నారు.

చాల పాజిటవ్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. ప్రేక్షుకులు సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని ఏరియాల నుండి మా సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే థియేటర్స్ ఇంకా పెరగాల్సి ఉంది.

 

మీ గురించి చెప్పండి. డైరెక్షన్ పై ఇంట్రస్ట్ ఎలా కలిగింది ?

మాది హైదరాబాదేనండి. కాలేజీ డేస్ నుంచే డైరెక్షన్ పై ఇంట్రస్ట్ కలిగింది. ఆల్ మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. మాకు ఒక టీం ఉంది. అందరం కలిసి పని చేసేవాళ్ళం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అంతా మేమే చేసుకున్నేవాళ్ళం.

 

కొత్త డైరెక్టర్ అంటే ఏ లవ్ స్టోరీనో తీసుకుని సినిమా చేస్తాడు. కానీ, మీరు సినిమాలో కనీసం సాంగ్స్, ఫైట్స్ అలాగే లవ్ కూడా పెట్టలేదు ?

అవేవి కథకు అవసరం లేదనిపించింది. సాంగ్స్ కథను ముందుకు డ్రైవ్ చేస్తేనే సాంగ్స్ ఉండాలని నా ఫీలింగ్.. ఈ సినిమాలో ఆ స్కోప్ లేదు. అందుకే సాంగ్స్ పెట్టలేదు. ఇక లవ్ సీన్స్ కూడా కథకు అక్కర్లేదు. అందుకే లవ్ స్టోరీని కూడా టచ్ చేయలేదు.

 

మీకు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది. నిర్మాత చెర్రీగారితో ఇంతకు ముందే మీకు పరిచయం ఉందా ?

లేదు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది. వెళ్లి కలిసి కథ చెప్పాను. ఆయనకు స్క్రిప్ట్ నచ్చింది. అలా మా జర్నీ మొదలైంది. దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది.

 

ఇండస్ట్రీలో ఈ సినిమాకి చాల మంచి టాక్ వినిపిస్తోంది ? ఈ ఆదరణ మీకు ముందే ఊహించారా ?

అవేం ఊహించలేదు. మొదటి ఒక్కటే అనుకున్నాం. రాసుకున్న కథను బాగా తీయాలి, దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.. ఆ ఆలోచనలతోనే కష్టపడ్డాం. అయినా సినిమా బాగుంటే వాళ్లే చూస్తారు.

 

ఇండస్ట్రీ నుంచి కాల్స్ ఏమైనా వస్తున్నాయా ?

ఇంకా పెద్దగా కాల్స్ అయితే రాలేదు. హీరో నిఖిల్ గారు మాత్రం కాల్ చేసి సినిమా గురించి మాట్లాడారు.

 

ఈ సినిమాలో చిరంజీవిగారి సినిమాలను చూపిస్తూ ప్లే రాసుకున్నారు. ప్రత్యేక కారణం ఏమైనా ఉందా ?

పర్సనల్ గా చిరంజీవిగారికి నేను పెద్ద ఫ్యాన్ ని. అందుకే ప్లే రాసుకున్నేటప్పుడే ఆయన పాత సినిమాలను గుర్తు చేస్తూ రాసుకొవాలని అనుకున్నాను. లక్కీగా అది బాగా సెట్ అయింది.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

కథలు రెండు మూడు ఉన్నాయి అండి. ఇంకా ఏమి అనుకోలేదు. వచ్చే అవకాశాలను బట్టి ఎలాంటి కథ చేస్తే బాగుంటుందో అదే చేస్తాను.

సంబంధిత సమాచారం :

More