ఆ బడా ప్రాజెక్ట్ కు ప్రభాస్ ప్లానింగ్ అలా ఉండే ఛాన్సే లేదా.?

Published on Sep 19, 2020 2:40 pm IST

మొత్తం మూడు అవుట్ స్టాండింగ్ ప్రాజెక్టులతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక రెండేళ్లు ఫుల్ బిజీగా మారిపోయాడు. నాగశ్విన్ తో ఒకటి రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధే శ్యామ్” అలాగే బాలీవుడ్ దర్శకుడు “ఆదిపురుష్” లాంటి భారీ చిత్రాల లైనప్ తో ఉన్నారు. ఇక వీటితో పాటుగా ప్రభాస్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రానుంది అని గత కొన్ని రోజుల నుంచి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అదే ప్రశాంత్ నీల్ తో చిత్రం. ఈ ప్రాజెక్ట్ పై ఇపుడు లేటెస్ట్ మరో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలోనే మొదలు పెట్టేస్తారని అలాగే 2021లోనే విడుదల చేసేస్తారని రాతలు మొదలయ్యిపోయాయి. కానీ అందుకు ఆస్కారం ఉందా అంటే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పాలి. ప్రభాస్ ఇప్పటికే నాగశ్విన్ మరియు ఓంరౌత్ తో చేయనున్న ప్రాజెక్టులను ఏకకాలంలో చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. మళ్ళీ ఇదే సమయంలో ఇంకో సినిమా మళ్ళీ అందులోకి ఒక స్పెషల్ లుక్ అంటే గగనమే.. మరి ప్రభాస్ ప్లానింగ్ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More