ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ బహుశా అదేనా.?

Published on Sep 19, 2020 7:01 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు సంబంధించి ఒక బిగ్ డే ఇపుడు రాబోతుంది. అదే ప్రభాస్ బర్త్ డే. వచ్చే అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టినరోజు కావడంతో ఆరోజు తాను నటిస్తున్న మూడు భారీ చిత్రాలకు సంబధించి ఏదొక అప్డేట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. అయితే వీటిలో మాత్రం ముందు రేస్ లో ఉన్న చిత్రం “రాధే శ్యామ్” టీం నుంచి ఖచ్చితంగా ఏదొక గిఫ్ట్ వచ్చే సూచనలు వస్తున్నాయి. .

గత కొన్ని రోజుల నుంచి ఈ చిత్రం నుంచి టీజర్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ఆరోజు అయితే టీజర్ లేదా మోషన్ పోస్టర్ టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా “జిల్” ఫేమ్ రాధే శ్యామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆ స్పెషల్ డే నాడు ఇంకేమన్నా గిఫ్ట్స్ ఉన్నాయో లేదో వెయిట్ చెయ్యాల్సిందే.

సంబంధిత సమాచారం :