ఈరోజు నుండి షూటింగ్ లో జాయిన్ కానున్న మెగా హీరో !
Published on Feb 19, 2018 11:25 am IST

ఇటీవల ‘ఇంటిలిజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ కరుణాకర్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈరోజు ప్రారంభమయ్యింది.

హీరో సాయి ధరమ్ తేజ్ ఈరోజు నుండి చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు డార్లింగ్ సామి రచయితగా పని చేస్తున్నారు. నిన్న జరిగిన అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు వేడుకల్లో నిర్మాత కె.ఎస్.రామారావ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. డైరెక్టర్ కరుణాకర్, హీరో సాయి ధరమ్ తేజ్, చిత్ర యూనిట్ అనుపమ బర్త్ డే సెలేబ్రషన్స్ లో పాల్గొనడం విశేషం.

 
Like us on Facebook