మెగా హీరో విడుదల చెయ్యనున్న సప్తగిరి సినిమా ట్రైలర్ !
Published on Nov 25, 2017 7:07 pm IST

సప్తగిరి ఎక్ష్పప్రెస్ సినిమా తరువాత సప్తగిరి హీరోగా “సప్తగిరి ఎల్ఎల్ బి” అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు రిలీజ్ చేయిస్తున్నాడు. సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ సాయి క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి’ పార్ట్‌-1ని ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’గా తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో మొదటి పాటని ఇటివల వినాయక్ విడుదల చెయ్యగా రెండో సాంగ్ ను సాయి ధరమ్ తేజ్ విడుదల చేసాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆదరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. డిసెంబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 
Like us on Facebook