టైటిల్ క్లాస్.. కంటెంట్ మాస్ అంటున్న మెగా హీరో !

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇంటిలిజెంట్’. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఆఖరి దశకు పనుల్లో ఉంది. అందుకే ప్రమోషన్లలో భాగంగా నిన్న నందమూరి బాలక్రిష్ణ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేశారు. వినాయక్ సినిమాకు పెట్టిన ‘ఇంటిలిజెంట్’ టైటిల్ క్లాస్ గానే ఉన్నా అందులో కంటెంట్ ను చూస్తే మాత్రం వినాయక్ మార్క్ సినిమాలో గట్టిగానే కనబడుతుందని స్పష్టమవుతోంది.

మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే డైలాగ్స్, ఫైట్స్ చిత్రంలో మెండుగా ఉండనున్నాయని, వాటితో పాటే కొత్త తరహా కథ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ కూడా స్పష్టం చేసింది. ‘జవాన్’ తో ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయిన తేజ్ ఈ సినిమాతో ఘన విజయాన్ని అందుకోవాలని ఉదేశ్యంతో ఉన్నారు. సి.కళ్యాణ్ నిర్మసీటున్న ఈ చిత్రంలో తేజ్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఫిబ్రవరి 4న ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనున్న ఈ చిత్రం అదే నెల 9న రిలీజ్ కానుంది.