మెగా, నందమూరి హీరోల మల్టీస్టారర్ టైటిల్ ఇదే!

kalyan-ram-sai-dharam-tej
మెగా హీరో సాయిధరమ్ తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు కొద్దిరోజులుగా వినిపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ దశలోనే ఉన్న ఈ సినిమాను ఇద్దరు హీరోలూ ఓకే చేయాల్సి ఉంది. దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో పడిపోయి ఉన్నారు. అన్నీ కుదిరితే సెట్స్‌పైకి వెళ్ళేందుకే సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కె.ఎస్.రవికుమార్ తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మించనున్నారు.

ఇక సినిమా సెట్స్‌పైకి వెళ్ళడం అటుంచితే ఈ సినిమాకు ‘రామకృష్ణ’ అనే టైటిల్‍ను ఇప్పట్నుంచే టీమ్ సిద్ధంగా ఉంచింది. కె.ఎస్.రవికుమార్ ఇప్పటికే ఫిల్మ్‌చాంబర్‌లో ఈ టైటిల్‌ను రిజిష్టర్ కూడా చేయించారు. ఇదే బ్యానర్‌పై ఆయన ‘స్టార్’ అన్న మరో టైటిల్‌ను కూడా రిజిష్టర్ చేయించారు. అన్నీ కుదిరి ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే మెగా, నందమూరి హీరోల మల్టీస్టారర్‌కు ‘రామకృష్ణ’ అన్న టైటిలే అవుతుందని ఆశించొచ్చు.