మెగా ప్రొడ్యూసర్ నయా బిజినెస్..!

Published on Dec 7, 2019 4:41 pm IST

టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకరు. అనేక సంవత్సరాలుగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో అనేక గొప్ప చిత్రాలను ఆయన తెరకెక్కించారు. తాజాగా ఆయన కుమారుడు బన్నీ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అలవైకుంఠపురంలో సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అలాగే యంగ్ హీరో నిఖిల్ తో ఓ మూవీ చేయనున్నట్లు ప్రకటించారు. వి ఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా ఈ మెగా ప్రొడ్యూసర్ ఓ టి టి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ రంగంలోకి అడుగిడనున్నారు. తన మొదటి ప్రాజెక్ట్ గా అర్జున్ సురవరం మూవీ డిజిటల్ హక్కులు కొన్నట్లు సమాచారం. దాదాపు 2.5 కోట్లకు అర్జున్ సురవరం మూవీ డిజిటల్ రైట్స్ కొన్నట్లు తెలుస్తుంది. అలాగే త్వరలో ఈ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి ఒక పేరు కూడా నిర్ణయించనున్నారట. ముందు చూపు గల సీనియర్ నిర్మాతగా భవిష్యత్తు ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ దే అని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఇప్పటికే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, సన్ నెట్ వర్క్, హాట్ స్టార్ వంటి సంస్థలు డిజిటల్ స్ట్రీమింగ్ లో దూసుకుపోతున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More