వెంకీ కెరీర్ లో గర్వంగా చెప్పుకొనే చిత్రం నారప్ప – చిరంజీవి

Published on Jul 24, 2021 3:00 am IST


అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయి, సర్వత్రా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్న నారప్ప చిత్రం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు విక్టరీ వెంకటేష్ నట విశ్వరూపం పై ప్రశంసల వర్షం కురిపించారు. కంగ్రాట్స్, నారప్ప ఇప్పుడే చూసాను, ఆ నటన, ఆ ట్రాన్స్ ఫామేశన్ వావ్ అంటూ చెప్పుకొచ్చారు. ఎక్కడా వెంకటేష్ కనబడలేదు అని, నారప్ప కనిపించాడు అంటూ చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఈ చిత్రం లో కొత్త వెంకటేష్ ను చూసినట్లు తెలిపారు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొనే, చాలా డెప్త్ కి వెళ్లి నటించావు అని అన్నారు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు అని వ్యాఖ్యానించారు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని అన్నారు. ఈ చిత్రం మంచి పేరుతో పాటుగా, కెరీర్ లో గర్వంగా చెప్పుకొనే చిత్రం అని అన్నారు. అయితే చిరు చేసిన వ్యాఖ్యల పట్ల వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు. మీరు మాట్లాడిన ప్రతి మాట మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని అన్నారు. థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :