“కలర్ ఫోటో”, “నాట్యం”, సుధా కొంగరకి మెగాస్టార్ స్పెషల్ కంగ్రాట్స్..!

Published on Jul 23, 2022 11:01 am IST

నిన్ననే ఎప్పుడు నుంచో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా అనేక భాషలకి సంబంధించి ఉత్తమ చిత్రాలు, నటీనటులు ఇంకా ఇతర కీలక క్యాటగిరీ లలో అవార్డులు అనౌన్స్ చేశారు. మరి మన తెలుగు సహా తమిళ్ మరియు మళయాళ భాషల్లో అనేక చిత్రాలు దర్శకులు సంగీత దర్శకులు కూడా గెలుచుకోగా వారి అందరికీ మెగాస్టార్ వరుసగా కంగ్రాట్స్ తెలియజేసారు.

మన తెలుగు నుంచి “కలర్ ఫోటో” టీం కి అలాగే “నాట్యం” చిత్ర యూనిట్ లకు మెగాస్టార్ స్పెషల్ కంగ్రాట్స్ తెలపగా తమిళ్ లో అవార్డుల పర్వం అందుకున్న చిత్రం “ఆకాశం నీ హద్దురా” దర్శకురాలు సుధా కొంగర, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ అలాగే మళయాళం నుంచి “అయ్యప్పణం కోషియం” టీం అందరికీ కూడా తన బెస్ట్ కంగ్రాట్స్ ని తెలియజేస్తున్నానని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

సంబంధిత సమాచారం :