మెగా క్లిక్ : ఆలీ కూతురు పెళ్ళిలో మెగాస్టార్ దంపతులు

మెగా క్లిక్ : ఆలీ కూతురు పెళ్ళిలో మెగాస్టార్ దంపతులు

Published on Nov 28, 2022 5:54 PM IST

టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా అలానే హీరోగా తన అద్భుత నటనతో ప్రేక్షకాభిమానులను మెప్పించి ఇటీవల అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీతో నిర్మాతగా కూడా మారారు యాక్టర్ ఆలీ. అలానే కొద్దిరోజుల క్రితం ఆయనని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహా దారుగా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఆ విధంగా మంచి పేరుతో కొనసాగుతున్న ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహ మహోత్సవం నిన్న హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది.

ఇక ఈ వేడుకకు అనేకమంది సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే విషయం ఏమిటంటే, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ దంపతులు ప్రత్యేకంగా ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలీ కుటుంబంతో మెగాస్టార్ దంపతులు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు