మెగాస్టార్ ఇప్పుడప్పుడే వెళ్ళేది లేదట.!

Published on May 5, 2021 7:00 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆల్ మోస్ట్ కూడా కంప్లీట్ అయ్యిపోయింది. ఇంకా కొన్ని రోజుల మేర షూట్ ఉంది అనగా కోవిడ్ తీవ్రత ఒక్కసారిగా ఎక్కువయ్యిపోయింది. దీనితో ఈ చిత్రం షూట్ నిలిపివేయబడింది.

అయితే మరి మిగతా షూట్ విషయంలో మాత్రం మెగాస్టార్ అసలు తొందర పడకూడదన్న భావనలో ఉన్నారట. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాకే షూట్ కి వెళ్లనున్నారని ఇపుడు తెలుస్తుంది. సో ఆచార్య బాలన్స్ షూట్ స్టార్ట్ అవ్వడానికి మరి కాస్త ఎక్కువ సమయం పట్టేలానే ఉందని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :