అభిమానుల్ని అలరిస్తున్న మెగా సర్ ప్రైజ్
Published on Sep 28, 2016 11:09 am IST

chiru-mek
ప్రస్తుతం మెగా అభిమానులకు పండుగ నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి 150వ సినిమా మొదలుపెట్టడం, పవన్ కళ్యాణ్ కూడా కొత్త సినిమా మొదలుపెట్టడం, చరణ్ ‘ధృవ’ సినిమాని పక్కాగా చేస్తుండటం, బన్నీ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం వంటి వాటిలో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇది చాలదన్నట్టు చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రూపంలో ఫ్యాన్స్ కు మరో పెద్ద బహుమతి ఇవ్వనున్నాడు. హిందీ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కి అనుకరణగా మాటీవీలో ప్రసారమయ్యే ఈ షోను మొదటి మూడు సీజన్లు అక్కినేని నాగార్జున హ్యాండిల్ చేశారు.

ఇక తరువాత రాబోయే నాలుగో సీజన్ కు చిరు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ షోకు సంబందించిన ప్రోమోను ‘మెగా సర్ ప్రైజ్’ పేరుతో మాటీవీ ఛానెల్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ‘కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టినవాడు మీతో కోటి గెలిపించేందుకు వస్తున్నాడు’ అంటూ సాగే ఈ ప్రోమోలో చిరంజీవి ఎంట్రీ ఇస్తున్న దృశ్యాలను షూట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమోటో మెగా అభిమానాలు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ షో 1డిసెంబర్ 2 నుండి మాటీవీలో ప్రసారం కానుంది.

వీడియో కొరకు క్లిక్ చేయండి

 
Like us on Facebook