లేటెస్ట్ : మెగాస్టార్ సమర్పణలో అమీర్ అవైటెడ్ సినిమా తెలుగు రిలీజ్.!

Published on Jul 16, 2022 11:02 am IST

బాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్ స్టార్స్ లో అమిర్ ఖాన్ హీరోగా మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “లాల్ సింగ్ చడ్డా”. దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కించిన ఈ చిత్రం హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా రీసెంట్ గానే అమిర్ ఖాన్ మెగాస్టార్ ఇంట్లో తనకి నాగార్జున, దర్శకులు రాజమౌళి, సుకుమార్ సహా నాగ చైతన్య లకి స్పెషల్ ప్రివ్యూ షో ని వేసి చూపించగా మెగాస్టార్ తన రెస్పాన్స్ ని ఇప్పుడు పంచుకున్నారు.

ఇక ఇదిలా ఉండగా దీని తర్వాత మెగాస్టార్ తన నుంచి ఒక మెగా అనౌన్సమెంట్ ని అయితే అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ లో “లాల్ సింగ్ చడ్డా” గా తన సమర్పణలో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుగు పోస్టర్ తో తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేస్తున్నందుకు ఆనందంగా భావిస్తున్నానని డెఫినెట్ గా ఈ సినిమా ఎమోషనల్ రైడ్ మా తెలుగు ఆడియెన్స్ ని మెప్పిస్తుంది, వారు కూడా ఈ సినిమాని అంతే బలంగా ఆదరిస్తారని మెగాస్టార్ తెలియజేసారు.

సంబంధిత సమాచారం :