భారీ యాక్షన్ లో మెగాస్టార్ “గాడ్ ఫాథర్” క్లైమాక్స్.?

Published on Jul 23, 2022 7:04 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లు ఏకకాలంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు మోహన్ రాజా తో చేస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రం “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. మళయాళ హిట్ సినిమా “లూసిఫర్” కి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చింది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ బయటకి వచ్చింది.

ప్రస్తుతం మేకర్స్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ షూట్ లో మెగాస్టార్ సహా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. పైగా ఈ షూట్ నుంచి ఓ క్రేజీ సీన్ పిక్ కూడా బయటకి వచ్చి అభిమానుల్లో మంచి వైరల్ గా మారింది. దీనితో ఈ ఈ విజువల్స్ మంచి వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :