ప్రామిసింగ్ గా ‘మేఘం చెప్పిన ప్రేమకథ’ టీజర్!

ప్రామిసింగ్ గా ‘మేఘం చెప్పిన ప్రేమకథ’ టీజర్!

Published on May 31, 2025 11:00 PM IST

Untitled 27 3

మత్తు వదలరా, కలి చిత్రాలతో మంచి మార్క్ వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు నరేష్ అగస్త్య హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రమే “మేఘాలు చెప్పిన ప్రేమ కథ”. యువ దర్శకుడు విపిన్ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇపుడు టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ మాత్రం మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి.

మోహన కృష్ణ ఇచ్చిన బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆహ్లాదకరమైన సంగీతంతో హీరో హీరోయిన్స్ నడుమ పరిచయ సన్నివేశంతో మొదలై వారి ప్రేమ కథ దానితో పాటుగా సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను చూపిస్తూ సాగిన ఈ టీజర్ బాగుంది. అలాగే ఇందులో సీనియర్ నటి రాధికా కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇలా మొత్తంగా మాత్రం ఈ టీజర్ ప్రామిసింగ్ గా కనిపిస్తుంది.

ముఖ్యంగా రాధే శ్యామ్, డియర్ కామ్రేడ్ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన సంగీతం మరింతగా సన్నివేశాల్ని ఎలివేట్ చేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటులు సుమన్, ఆమని, తులసి, విద్యుల్లేఖ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా ఉమాదేవి కోట నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ చిత్రానికి సంబంధించిన డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు