వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ప్రిజాద !

ఇటీవలే ‘ఫిదా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో అనిల్ రావిపూడితో ‘ఎఫ్ 2’ అనే సినిమా చేయనున్నారు. ఈ చిత్రం మల్టీ స్టారర్ గా ఉండనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టులో వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ ను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట అనిల్ రావిపూడి.

అనిల్ రావిపూడి గత చిత్రం ‘రాజా ది గ్రేట్’ లో సైతం మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. మరి ఆమెను ఎప్పుడు ఫైనల్ చేస్తారో చూడాలి. ఇకపోతే ఈ మల్టీస్టారర్లో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక ప్రధాన పాత్ర చేస్తున్నట్టు వార్తలొచ్చాయి కానీ ఇంకా దీనిపై క్లారిటీ అందలేదు.