యూఎస్ లో తిరుగులేని ప్రభంజనంతో “RRR” లేటెస్ట్ వసూళ్లు.!

యూఎస్ లో తిరుగులేని ప్రభంజనంతో “RRR” లేటెస్ట్ వసూళ్లు.!

Published on Mar 27, 2022 8:00 AM IST

ఇప్పుడు మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ సహా ఓవర్సీస్ బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బ్లాస్టర్ సెన్సేషనల్ వసూళ్లు నమోదు చేస్తూ సరికొత్త ప్రభంజనం సృష్టిస్తుంది. మరి యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అయితే ఈ భారీ సినిమా మొదటి రోజే రికార్డు మిలియన్ డాలర్స్ ని క్రాస్ చెయ్యగా..

లేటెస్ట్ గా ఈ సినిమా రెండో రోజుకి ఏకంగా 7.25 మిలియన్ మార్క్ ని దాటేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా దీనితో ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 50 శాతం రాబట్టేసింది అని అంటున్నారు. అలాగే ఈ వారాంతానికి అయితే ఈ చిత్రం 10 మిలియన్ కి పైగా వసూలు చేసినా ఆశ్చర్యం లేదని కూడా టాక్. మొత్తానికి అయితే ఇండియన్ రికార్డ్స్ ని సరికొత్తగా సృష్టిస్తున్న ఈ చిత్రపు ప్రభంజనం ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు