లేటెస్ట్..”భారతీయుడు 2″లో విలక్షణ ఇండియన్ సూపర్ విలన్.!

Published on Dec 30, 2021 6:11 pm IST


భారతీయ సినిమాని హాలీవుడ్ లెవెల్లో ఎప్పుడో తీసుకెళ్లిన టాప్ దర్శకుడు శంకర్. ఇది అందరికీ తెలిసిందే. తాను చేసే సబ్జెక్టులు కానీ చూపించే విజువల్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అదే విధంగా తన ‘రోబో’ సినిమాతో ఇండియన్ సినిమాకి ఒక సూపర్ హీరోని అలాగే సూపర్ విలన్ ని కూడా శంకర్ పరిచయం చేశారు. అయితే తన కెరీర్ లో భారీ హిట్ అయినటువంటి మరో సినిమా “భారతీయుడు”.

విశ్వ నటుడు కమల్ హాసన్ తో చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ స్టార్ట్ చెయ్యగా అది మధ్యలో నిలిచిపోవాల్సి వచ్చింది. ఇక మళ్ళీ ఏదొకలా సినిమాని శంకర్ తోనే చేయించే డీల్ సెట్ చేసుకోగా ఇప్పుడు ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా క్యాస్టింగ్ లోకి ప్రస్తుతం సూపర్ హిట్ అయిన సూపర్ హీరో చిత్రం “మిన్నల్ మురళీ” లో సూపర్ విలన్ పాత్రలో నటించిన గురు సోమసుందరం ని కూడా కీలక పాత్ర కోసం తీసుకున్నారట. మిన్నల్ మురళీ లో ఈ నటుడు అద్భుతమైన హావభావాలు పలికించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఇతడి పేరు భారతీయుడు 2 క్యాస్టింగ్ లో యాడ్ అయ్యిందట. మరి శంకర్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :