మహానటి మిస్ ఇండియా గెటప్ లో…!

Published on Aug 26, 2019 8:11 pm IST

గత ఏడాది మహానటి చిత్రంతో అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు పొందిన కీర్తి సురేష్ మరో సంచలనం చిత్రానికి సిద్ధమైంది. మిస్ ఇండియా అనే పేరుతో తెరకెక్కుతున్న మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆమె నటించనున్నారు. నటనకు అత్యంత ప్రాధాన్యం ఉన్న చిత్రం కావడంతో ఈ పాత్ర కొరకు కీర్తిని ఎంచుకున్నారట.

కాగా నేడు ఈ మూవీ టైటిల్ టీజర్ ని విడుదల చేయడం జరిగింది. గతానికి భిన్నంగా కీర్తి ఈ చిత్రంలో అల్ట్రా మోడ్రన్ అమ్మాయి గా కనిపిస్తుంది. బొద్దుగా ఉండే కీర్తి ఈ పాత్ర కోసం బరువు కూడా తగ్గడం గమనార్హం. కొత్త దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వం వహిస్తుండగా,నిర్మాత మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :