స్టన్నింగ్ లుక్ కోసం మరోసారి మిస్టర్ బాక్సాఫీస్.!

Published on Sep 17, 2020 1:55 pm IST

అభిమానులు మిస్టర్ బాక్సాఫీస్ గా పిలుచుకోబడే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి లుక్ కోసం సిద్ధం చేసిన సిక్స్ ప్యాక్ కటౌట్ ఈ టీజర్ తో బాలీవుడ్ వర్గాలను సైతం స్టన్ చేసింది.

చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆ టీజర్ లో ఫుల్ ఆన్ షర్ట్ లెస్ గా కనిపించి తన మాచో బాడీతో ఆకట్టుకున్నాడు. అప్పుడు సూపర్బ్ గా ఫిట్నెస్ లెవెల్ ను మైంటైన్ చేసిన చరణ్ లాక్ డౌన్ మూలాన అంతా పక్కన పెట్టేసారు. కానీ ఇప్పుడు షూటింగ్స్ మళ్ళీ మొదలు కానుండడంతో ఈ సినిమా కోసం మళ్ళీ అదే ఫిట్నెస్ లుక్ కోసం మరోమారు జిమ్ లో అడుగు పెట్టారు.

ఇపుడు అందుకు సంబందించిన ఫొటోలే సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. చరణ్ ఈ చిత్రంతో పాటుగా కొరటాల మెగాస్టార్ చిరంజీవితో తీయనున్న “ఆచార్య”లో కూడా ఒక కీ రోల్ చెయ్యనున్నారు. మరి ఈ రెండిటిలో ఏ చిత్రాన్ని ముందు మొదలు పెట్టనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More