గ్రేట్ స్నాప్ : ఆస్కార్ నామినీ లంచ్ లో కీరవాణి, చంద్రబోస్.!

Published on Feb 14, 2023 9:02 am IST

మన తెలుగు సినిమా మరియు భారతీయ సినిమా ఎంతో గర్వించదగ్గ ప్రైడ్ మూమెంట్ ని అయితే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి అలాగే సాహిత్య రచయిత చంద్రబోస్ లో “రౌద్రం రణం రుధిరం” చిత్రంలోని నాటు నాటు సాంగ్ తో అందించారు. ప్రపంచమే మైమరచిపోయి తెలుగు సాంగ్ కి నాట్యం చేసేలా చేసిన ఈ సాంగ్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ చేయించిన డాన్స్ తో నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయింది.

దీనితో వరల్డ్ వైడ్ భారీ సక్సెస్ అయ్యిన ఈ సాంగ్ దెబ్బకి ఆస్కార్ లో నామినేట్ అయ్యింది. మరి దీనితో సాంగ్ కంపోజ్ చేసిన కీరవాణి సాహిత్య రచయిత చంద్రబోస్ లకి అపారమైన గౌరవం దక్కింది. మరి ఇదిలా ఉండగా తాజాగా సినీ వర్గాల్లో ఓ పిక్ వైరల్ గా మారింది. ఈ ఏడాది ఆస్కార్ లో నామినేట్ అయ్యిన వరల్డ్ వైడ్ నామినీస్ అందరికీ అకాడమీ వారు లాస్ ఏంజెల్స్ లో ప్రతిష్టాత్మక లంచ్ కి ఆహ్వానించడం జరిగింది.

మరి ఇందులో చంద్రబోస్ మరియు కీరవాణి లు కూడా ఆహ్వానంతో హాజరయ్యారు. మరి భారీ సంఖ్యలో ఉన్న ఈ నామినీస్ కి ఓ గ్రేట్ స్నాప్ ని అయితే అకాడమీ వారు తీశారు. అందులో కీరవాణి మరియు చంద్రబోస్ లు కూడా కనిపించడం విశేషం దీనితో ఈ పిక్ ఇప్పుడు సినీ వర్గాల్లో అమితంగా వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :